వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు.
ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 41,938 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

స్వాగతం
ఈ వారపు బొమ్మ
సెయింట్ పీటర్స్ బసిలికా

రోమ్ నగరంలోని వాటికన్ నగరంలోని "సెంట్ పీటర్స్ బసిలికా" ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన భవనాలలో ఒకటి. దీని నిర్మాణం 1506 - 1625 మధ్యకాలంలో జరిగింది. మైఖేలాంజెలో వంటి అనేక కళాకారులు, భవన నిర్మాపకులు దీని నిర్మాణంలో పాలు పంచుకొన్నారు.

ఫోటో సౌజన్యం: Wolfgang Stuck
మార్గదర్శిని
ఆంధ్ర ప్రదేశ్
భాష మరియు సంస్కృతి
తెలుగు సినిమా
భారత దేశము మరియు ప్రపంచము
విజ్ఞానము మరియు సాంకేతికం
విశేష వ్యాసాలు
సహకారము
ఈ వారపు వ్యాసము


సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 14 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.

ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక లలో సంక్రాంతి అని; తమిళనాడు లో పొంగల్ అని; మహారాష్ట్ర, గుజరాత్ లలో మకర్‌ సంక్రాంతి అని; పంజాబు, హర్యానా లలో లోరీ అని పిలవబడే ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ జరుపుకునే మూడు రోజులలో మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని, మూడవ రోజును కనుమ అని పిలుస్తారు. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతూ ఉంటాయో చూసి తీరవలసిందే. బుడబుక్కలవాళ్లు, పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే - అంటే ధనుర్మాసం ఆరంభం నుండే - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు.

.....పూర్తివ్యాసం: పాతవి

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాలనుండి

సోమనాథ్ వ్యాసం
  • ... ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో సోమనాథ్ మొదటిది అనీ! (సోమనాథ్ వ్యాసం)(కుడివైపున బొమ్మ చూపబడినది)
  • ... ప్రహ్లాదుని తండ్రి మరియు రాక్షస రాజైన హిరణ్యకశిపుడు శాపగ్రస్తుడైన వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయుల్లో ఒకడనీ! ( హిరణ్యకశిపుడు వ్యాసం)
  • ... తమిళ సాహిత్యానికి మకుటంలా భావించే తిరుక్కురల్ ను రచించింది తిరువళ్ళువర్ అనీ! (తిరువళ్ళువర్ వ్యాసం)
  • ... గడ్డం రాంరెడ్డిని భారత దేశంలో దూర విద్యా పితామహునిగా భావిస్తారనీ! (గడ్డం రాంరెడ్డి వ్యాసం)
  • ... మొఘల్ ఎ అజం అనే సినిమా నిర్మాణానికి తొమ్మిదేళ్ళు పట్టిందని. (మొఘల్ ఎ అజం వ్యాసం)
  • ... కిరణ జన్య సంయోగ క్రియ అనగా జీవరాశుల మనుగడకు నిత్యావసరమైన పిండిపదార్థం తయారయ్యే ఒక కీలకమైన ప్రక్రియ అనీ! (కిరణజన్య సంయోగక్రియ వ్యాసం)


చరిత్రలో ఈ రోజు

జనవరి 7
1935: భారత జాతీయ సైన్సు అకాడమీని కలకత్తాలో నెలకొల్పారు.

సోదర ప్రాజెక్టులు:
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీసోర్స్ 
మూలములు 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకరమనిపించినట్లయితే, దయచేసి సహాయము చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామగ్రి కొనుగోలు చేయుటకు ఉపయోగిస్తారు.
  Change language: All | العربية | Bahasa Indonesia | Български | Català | Cebuano | Česky | Dansk | Deutsch | Eesti | English | Español | Esperanto | Français | עברית | Hrvatski | Italiano | 한국어 | Lietuvių | Magyar | Nederlands | 日本語 | Norsk (bokmål) | Polski | Português | Русский | Română | Slovenčina | Slovenščina | Српски / Srpski | Suomi | Svenska | తెలుగు | Türkçe | Українська | 中文

 

All text is available under the terms of the GNU Free Documentation License.
Wikipedia is a registered trademark of the Wikimedia Foundation, Inc.

 chicago web design | web design resources | dowcipy angielskie | imiona angielskie |